English | Telugu

రెమ్యునరేషన్‌తోపాటు అన్నీ పెంచుతుందట.. ఇక యూత్‌కి పండగే!

అనుపమ పరమేశ్వరన్‌.. మలయాళ చిత్రం ‘ప్రేమమ్‌’తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ‘అఆ’ చిత్రంలో నటించి అందర్నీ మెప్పించింది. ఆ తర్వాత తెలుగులో చాలా సినిమాలు చేసినప్పటికీ శతమానం భవతి, కార్తికేయ2 మాత్రమే ఆమెకు హీరోయిన్‌గా మంచి పేరును తెచ్చాయి. మిగతా హీరోయిన్లతో పోలిస్తే అనుపమ కెరీర్‌ మందకొడిగానే వెళుతోంది. తెలుగులో ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తోంది. అవి రెండు నెలల్లో రిలీజ్‌ అవుతున్నాయి. ఇప్పటివరకు మరో సినిమా సైన్‌ చెయ్యలేదు. అయితే తమిళ్‌, మలయాళంలో ఒక్కో సినిమా చేస్తోంది. ఇప్పుడున్న హీరోయిన్లలో వయసులో చిన్నదైన అనుపమకి ఇంకా మంచి ఫ్యూచర్‌ ఉంది. కానీ, అవకాశాలు మాత్రం రావడం లేదు. ఆఫర్లు రాబట్టేందుకు, అవకాశాలు పెరిగేందుకు అనుపమ ఓ కొత్త రూట్‌ని సెలెక్ట్‌ చేసుకున్నట్టు తెలుస్తోంది.

అదేమిటంటే.. ఇకపై తన గ్లామర్‌ను స్క్రీన్‌పై మరింత పెంచేందుకు ట్రై చేస్తున్నట్టు సమాచారం. ఈ విషయం ఆమధ్య విడుదలైన రౌడీబాయ్స్‌ చిత్రంలోనే కనిపించింది. ఆ సినిమాలో లెక్కకు మించిన లిప్‌లాక్‌ సీన్స్‌తో యూత్‌కి పిచ్చెక్కించింది. ఇక డిజెటిల్లు సీక్వెల్‌లో కూడా బోల్డ్‌ సీన్స్‌ చేసిందట. ఇకపై కూడా దాన్ని కంటిన్యూ చెయ్యాలని భావిస్తోందట అనుపమ. దానికి తగ్గట్టుగానే సినిమాకి కోటి రూపాయల వరకు డిమాండ్‌ చేస్తోందని సమాచారం. దీన్నిబట్టి ఇక అనుపమ వరస సినిమాలతో బిజీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అలాంటి బోల్డ్‌ కంటెంట్‌ ఉన్న సబ్జెక్ట్స్‌ని వినిపించేందుకు కొందరు దర్శకులు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. గత సినిమాల్లో ఎంతో పద్ధతిగా కనిపించిన అనుపమ ఇప్పుడు బోల్డ్‌ సీన్స్‌లో సైతం రెచ్చిపోతోంది. మరి రాబోయే సినిమాల్లో డోస్‌ మరింత పెంచేందుకు అనుపమ రెడీ అవుతుందోట.