English | Telugu
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నాని!
Updated : Dec 14, 2023
నేచురల్ స్టార్ నాని ఈ ఏడాది మాస్ మూవీ 'దసరా', క్లాస్ మూవీ 'హాయ్ నాన్న'తో మంచి విజయాలను సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆయన వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో 'సరిపోదా శనివారం' అనే మూవీ చేస్తున్నాడు. దీని తర్వాత నాని చేయబోయే సినిమా ఏంటనే ఆసక్తి అందరిలో నెలకొంది. పలువురు దర్శకులు సైతం నానితో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అయితే తాజాగా నాని తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తో ఓ మూవీ చేయడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది.
'పిజ్జా', 'జిగర్తాండ', 'పేట', 'మహాన్' వంటి సినిమాలతో తమిళనాట దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కార్తీక్ సుబ్బరాజ్. అయితే ఇప్పుడు ఆయన చూపు తెలుగు మీద పడిందట. ఈమధ్య పలువురు తమిళ దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడదే బాటలో కార్తీక్ సుబ్బరాజ్ పయనిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఈ కోలీవుడ్ డైరెక్టర్ చెప్పిన కథ నచ్చి, ఆయన డైరెక్షన్ లో సినిమా చేయడానికి నాని ఓకే చెప్పినట్లు టాక్. త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశముందని అంటున్నారు.