English | Telugu

భద్ర దర్శకుడితో మళ్ళీ రవితేజ

"భద్ర" చిత్ర దర్శకుడితో మళ్ళీ మాస్ రాజా హీరో రవితేజ హీరోగా నటించబోతున్నాడని ఫిలిమ నగర్ వర్గాలనుకుంటున్నాయి. వివరాల్లోకి వెళితే గతంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై, మాస్ రాజా రవితేజ హీరోగా, మీరా జాస్మిన్ హీరోయిన్ గా, దిల్ రాజు నిర్మించిన సూపర్ హిట్ మూవీ "భద్ర" చిత్రంతో దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం అయిన బోయపాటి శీను ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ హీరోగా, నయనతార హీరోయిన్ నటించిన "తులసి" చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ "తులసి" చిత్రం కూడా సూపర్ హిట్టయ్యింది. దాని తర్వాత యువరత్న నందమూరి బాలకృష్ణ హీరోగా, నయనతార, స్నేహా ఉల్లాల్ హీరోయిన్లుగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం "సింహా" చిత్రానికి దర్శకత్వం వహించారు బోయపాటి శీను.


యంగ్ టైగర్ యన్ టి ఆర్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా బోయపాటి దర్శకత్వంలో ఒక చిత్రం రానుందని అందరికీ తెలిసిన సంగతే. ఇక్కడ నిజమెంతో అబద్ధమెంతో తెలియదు కానీ ఫిలిం నగర్ లో బాగా వినపడుతున్న మాటల ప్రకారం బోయపాటిని హీరో యన్ టి ఆర్ నమ్మటం లేదనీ, దాంతో మనస్తాపమ చేందిన బోయపాటి తన తొలిచిత్రంలో హీరోగా నటించిన రవితేజకు యన్ టి ఆర్ కు చెప్పిన కథనె చెప్పటం అది రవితేజకు నచ్చటం జరిగిందట. దీంతో యన్ టి ఆర్ మెహెర్ రమేష్ వంటి వారి మాటలను మాత్రమే నమ్ముతారు కానీ బోయపాటి వంటి ష్యూర్ షాట్ డైరెక్టర్ల మాటలు నమ్మరని ఫిలిం నగర్ లో ప్రచారం జరుగుతోంది.