English | Telugu

యన్ టి ఆర్ శక్తి బిజినెస్ పరంగా మగధీరని మించిందా...!

యన్ టి ఆర్ "శక్తి" చిత్రం బిజినెస్ పరంగా రామ్ చరణ్ హీరోగా నటించిన ఆల్ టైమ్ హిట్ "మగధీర" కన్నా ఎక్కువ చేసిందని ఫిలిం నగర్ వర్గాల భోగట్టా. వివరాల్లోకి వెళితే గతంలో గీతా ఆర్ట్స్ పతాకంపై, రామ్ చరణ్ హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, రాజమౌళి దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మించిన "మగధీర" చిత్రం తెలుగు చలన చిత్ర బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. ఆ చిత్రం రికార్డులను యన్ టి ఆర్ "శక్తి" చిత్రం తిరగ రాస్తుందని యన్ టి ఆర్ అభిమానులు, నందమూరి వీరాభిమానులంతా తెగ ఆశిస్తున్నారు. కానీ అది అంత సులువైన విషయమేం కాదు.

అసలు "మగధీర" సినిమా రాజమౌళిని తీయమన్నా మళ్ళీ అంత గొప్పగా తీయలేడని సినీ పండితులమటారు. కొన్ని అరుదైన సినిమాలకి మాత్రమే అలా అన్నీ శుభలక్షణాలు కలిగి, శుభశకునాలన్నీ అలా అలా కలిసొస్తాయి. అలాంటి అరుదైన సినిమానే "మగధీర". యన్ టి ఆర్ "శక్తి" కూడా అలా "మగధీర" సినిమాలా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందో లేదో కానీ బిజినేస్ పరంగా "శక్తి" చిత్రం "మగధీరను" అధిగమించిందని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.