English | Telugu
చిరంజీవి సార్.. మీరు చాలా మారిపోయారు సార్!
Updated : Aug 29, 2023
రీఎంట్రీలోనూ తన రేంజ్ కి తగ్గ బ్లాక్ బస్టర్స్ చూశారు మెగాస్టార్ చిరంజీవి. ఖైదీ నం 150, వాల్తేరు వీరయ్య.. ఇలా అనూహ్య విజయాలతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. అయితే సైరా నరసింహారెడ్డి, ఆచార్య, గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాలు మాత్రం ఆశించిన విజయం సాధించలేదు.
ఇదిలా ఉంటే, ఓటీటీ యుగంలోనూ రీమేక్స్ ని సమర్థిస్తూ వస్తున్న మెగాస్టార్.. తాజాగా షాకింగ్ డెసిషన్ తీసుకున్నారని సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే.. రీసెంట్ గా ఓ ప్రముఖ నిర్మాత ఓ క్రేజీ మాలీవుడ్ హిట్ కి సంబంధించిన రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్నారట. ఆ రీమేక్ మెగాస్టార్ చేస్తేనే న్యాయం జరుగుతుందని.. తనని అప్రోచ్ అయ్యారట. అయితే భోళా శంకర్ ఘోర పరాజయంతో ఇక రీమేక్స్ చేయకూడదని ఫిక్స్ అయిన చిరు.. మోహమాటం లేకుండా నో చెప్పారంట. దాంతో.. ఆ రీమేక్ కి బ్రేక్ పడిందని టాక్. ఈ విషయం తెలిసి మెగా ఫ్యాన్స్.. "చిరంజీవి సార్.. మీరు చాలా మారిపోయారు సార్" అంటూ కామెంట్స్ చేస్తున్నారు.