English | Telugu

రామ్‌చరణ్‌, సంజయ్ లీలా భన్సాలీ మూవీ స్టోరీ రివీల్ అయింది!

కొన్నిరోజులుగా రామ్‌చరణ్‌ బాలీవుడ్‌లో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడన్న వార్తలు వస్తున్నాయి. ఆ సినిమాకి సంజయ్‌ లీలా భన్సాలీ డైరెక్టర్‌ అనే వార్త బాగా స్ప్రెడ్‌ అయింది. అయితే రామ్‌చరణ్‌, సంజయ్‌ లీలా బన్సాలీ కాంబినేషన్‌లో తెరకెక్కే మూవీ ఎప్పుడు స్టార్ట్‌ అవుతుందనే విషయంలో ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఎందుకంటే ప్రస్తుతం శంకర్‌ డైరెక్షన్‌లో ‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రంలో నటిస్తున్నాడు చరణ్‌. ఈ సినిమా తర్వాత బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ పీరియాడిక్‌ మూవీ చెయ్యాల్సి ఉంది. 

సంజయ్‌ లీలా భన్సాలి డైరెక్షన్‌లో రామ్‌చరణ్‌ సినిమా చెయ్యబోతున్నాడనగానే మెగా ఫ్యాన్స్‌ ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి రకరకాల వార్తలు మీడియాలో వచ్చాయి. అయితే ఆ సినిమా ఎలాంటి సబ్జెక్ట్‌తో చేయబోతున్నారనే విషయం తెలియవచ్చింది. వీరి కాంబినేషన్‌లో సినిమా చెయ్యాలన్నది ఇప్పటి ఆలోచన కాదు. కోవిడ్‌ టైమ్‌ నుంచి ఈ కాంబినేషన్‌పై వర్కవుట్‌ చేస్తున్నారు. మగధీర చిత్రంలో రాంచరణ్‌ హార్స్‌ రైడిరగ్‌, కత్తి యుద్దాల వంటివాటిని అలవోకగా చేయడం వల్ల సంజయ్‌ దృష్టి అతనిపై పడిరది. 

సంజయ్‌ లీలా భన్సాలీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత 25 సంవత్సరాలుగా బాలీవుడ్‌లో అద్భుతమైన క్లాసిక్స్‌ను తెరకెక్కించిన ఘనత సంజయ్‌ది. ఖామోషి నుంచి గంగూబాయ్‌ కతియావాడి వరకు ఎన్నో బ్లాక్‌బస్టర్స్‌, మరెన్నో క్లాసిక్స్‌ని తెరకెక్కించారు. తాజాగా మరో చారిత్రాత్మక చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారు. 11వ శతాబ్దానికి చెందిన వీరాధివీరుడైన మహారాజు సుహీల్‌దేవ్‌ చరిత్ర ఆధారంగా అమిష్‌ త్రిపాఠి ఓ కథని రెడీ చేశారు. ఆ కథతోనే సంజయ్‌ సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నాడు. సుహీల్‌దేవ్‌ ఉత్తరప్రదేశ్‌లోని బప్‌ారీచ్‌ కేంద్రంగా భారతదేశాన్ని పాలించాడు. కానీ, కాలక్రమంలో చరిత్ర వక్రీకరించబడడం వల్ల సుహీల్‌ పరాక్రమం గురించి చాలా మందికి తెలియదని చెబుతారు. ఇండియాలోకి గజినీ చక్రవర్తుల ఆక్రమణ జరగకుండా సుహీల్‌ ఉన్నంతవరకు అడ్డుకున్నాడు. మహమ్మద్‌ ఆఫ్‌ గజినీని ఓడిరచాడు సుహీల్‌. ఇతర రాజుల సహాయంతో మహాకాల సైన్యం ఏర్పాటు చేసి గజినీలకు చుక్కలు చూపించిన వీరుడు సుహీల్‌ దేవ్‌. 

అలాంటి ఓ మహావీరుడి కథతో సినిమా చెయ్యాలంటే రామ్‌చరణ్‌లాంటి హీరో పర్‌ఫెక్ట్‌గా సరిపోతాడని భావించిన సంజయ్‌లీలా భన్సాలీ ఈ ప్రాజెక్ట్‌ చేసేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే ప్రాథమిక చర్చలు ముగించారని తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కించే ఈ గ్లోబల్‌ ప్రాజెక్ట్‌తో బాలీవుడ్‌లో సంజయ్‌ మరో సంచలనం సృష్టించడం ఖాయమని బాలీవుడ్‌ వర్గాలు భావిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.