English | Telugu

రామ్ చరణ్ స్క్రిప్ట్ మార్చిన ప్రభుదేవా

రామ్ చరణ్ స్క్రిప్ట్ మార్చిన ప్రభుదేవా అని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే ఒక సంవత్సరం క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఒక కథ చెప్పటం జరిగిందట. అయితే దాని మీద తన నిర్ణయం చెప్పకుండా రామ్ చరణ్ ఆ కథని పెండింగ్ లో ఉంచారట. ప్రస్తుతం "విక్రమార్కుడు" రీమేక్ అయిన "విక్రమ్ రాథోడ్" అనే హిందీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ప్రభుదేవా ఈ చిత్రం తర్వాత రామ్ చరణ్ చిత్రానికి దర్శకత్వం వహించే ఆలోచనలో ఉన్నాడు.

అందుకని గతంలో రామ్ చరణ్ కి తాను చెప్పిన కథకి కొన్ని మార్పులు చేర్పులూ చేర్చే పనిలో ఉన్నాడట. రామ్ చరణ్ ప్రస్తుతం వినాయక్, వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న చిత్రాల్లో నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలూ పూర్తయ్యాక ప్రభుదేవా దర్శకత్వంలోని సినిమా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.