English | Telugu
"గబ్బర్ సింగ్" హిట్ కాకపోతే నన్ను చంపండి
Updated : Jan 23, 2012
"గబ్బర్ సింగ్" హిట్ కాకపోతే నన్ను చంపండి అని ఆ చిత్ర నిర్మాత బండ్ల గణేష్ అన్నారట. వివరాల్లోకి వెళితే పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, శృతి హాసన్ హీరోయిన్ గా, "మిరపకాయ్" ఫేం హరీష్ శంకర్ దర్శకత్వంలో, బండ్ల గణేష్ నిర్మిస్తున్న చిత్రం"గబ్బర్ సింగ్". ఈ "గబ్బర్ సింగ్" సినిమాకి హిందీలో సూపర్ హిట్టయిన "దబాంగ్" చిత్రం మాతృక అన్న సంగతి ప్రేక్షకులకు తెలిసిందే. ఈ సినిమా గురించి ఈ చిత్ర నిర్మాత ట్విట్టర్ లో "ఈ "గబ్బర్ సింగ్" సినిమా గనక హిట్టవ్వక పోతే నన్ను చంపండి" అని ట్వీట్ చేశాడని సమాచారం.
ఈ "గబ్బర్ సింగ్" సినిమాలోని యాక్షన్ సీన్లను ఇటీవల రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్ల నేతృత్వంలో చిత్రీకరించారు. ఈ యాక్షన్ సీన్ ఇంటర్వెల్ ముందు వస్తుంది. ఈ చిత్రం యూనిట్ కేరళలోని పొల్లాచ్చికి హీరో, హీరోయిన్ల మీద ఒక పాటను చిత్రీకరించటానికి బయలుదేరుతుంది. ఫిబ్రవరి 14 వ తేదీ, అంటే వేలంటైన్స్ డే రోజున ఈ "గబ్బర్ సింగ్" చిత్రం టీజర్ విడుదలవుతుంది.