English | Telugu

"డివియస్ కర్ణ" ఆగినట్టేనా...!

"డివియస్ కర్ణ" ఆగినట్టేనా...! వివరాల్లోకి వెళితే గతంలో విశ్వ విఖ్యాత నటసార్వభౌమ, నటరత్న, డాక్టర్ నందమూరి తారక రామారావు శ్రీకృష్ణుడిగా, సుయోధన సార్వభౌముడిగా, కర్ణుడిగా త్రిపాత్రాభినయం చేస్తూ, స్వీయదర్శకత్వంలో నిర్మించిన "దాన వీర శూర కర్ణ" చిత్రం పౌరాణిక చిత్రాల్లో ఒక కళాఖండంగా నిలిచి ప్రేక్షకజన నీరాజనాలందుకుంది. ఆ "దాన వీర శూర కర్ణ" చిత్రాన్ని జూనియర్ యన్ టి ఆర్ రీమేక్ చేయాలని ఆలోచిస్తున్నారనీ, ఆ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తారనీ విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.

ప్రస్తుతం తన బాబాయ్ బాలకృష్ణ నటించిన "శ్రీరామరాజ్యం" చిత్రం తానూహించిన స్థాయిలో ఘనవిజయం సాధించకపోవటంతో జూనియర్ యన్ టి ఆర్ ప్రస్తుతం "దాన వీర శూర కర్ణ" చిత్రాన్ని రీమేక్ చేసే ఆలోచన విరమించుకున్నాడని తెలిసింది. ఈ "దాన వీర శూర కర్ణ" సినిమాకి అత్యంత భారీ బడ్జెట్ ఖర్చవుతుందనీ, సినిమా విజయం సాధింకపోతే మొత్తం పెట్టిన పెట్టుబడి తిరిగిరాదన్న ఆలోచనతోనే ఈ చిత్రనిర్మాణాన్ని యన్ టి ఆర్ విరమించుకున్నట్టు సమాచారం.