English | Telugu
రామ్ చరణ్ కూతురు క్లీన్ కార కేర్ టేకర్ గా సావిత్రి? జీతం లక్షన్నర ?
Updated : Feb 5, 2024
ఎవరైనా సెలబ్రిటీగా మారాలంటే కొంత సమయం పడుతుంది. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన ల ముద్దుల కూతురు క్లీన్ కార మాత్రం అప్పుడే బుల్లి సెలబ్రిటీ గా మారిపోయింది. ఫేస్ ని ప్రపంచానికి చూపించకుండానే తన పవర్ ని చూపిస్తుంది. తాజాగా తనకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హల్ చేస్తుంది.
క్లీన్ కార కి చరణ్ దంపతులు ప్రముఖ ఫేమస్ కేర్ టేకర్ సావిత్రి ని నియమించారనే రూమర్ ఒకటి చక్కర్లు కొడుతుంది. చిన్న పిల్లల మనస్తత్వాలని అర్ధం చేసుకొని వాళ్ళకి ఏమేం కావాలో చేసి పెట్టడంలో సావిత్రి స్పెషలిస్ట్ అనే మాటలు వినిపిస్తున్నాయి చరణ్ గేమ్ చేంజర్ షూటింగ్ లో బిజీగా ఉండటంతో పాటు ఉపాసన కూడా అపోలో కి సంబంధించిన పనుల్లో బిజీ గా ఉండటం వలన క్లీన్ కార ఆలనా పాలన చూసేందుకు సావిత్రిని నియమించారని అంటున్నారు.ఆమెకి నెల జీతం లక్షన్నర అని కూడా అంటున్నారు.కాకపోతే ఈ విషయం మీద ఎలాంటి అధికార ప్రకటన లేదు.
సావిత్రి గతంలో ప్రముఖ హీరోయిన్ కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ ల కొడుకుకి కేర్ టేకర్ గా పని చేసింది. అలాగే మరో అగ్ర నటుడు షాహిద్ కపూర్ ఇంట్లో కూడా ఆమె పని చేసింది.చరణ్ దంపతులు క్లీన్ కార తో కలిసి ముంబై వెళ్ళినప్ప్పుడు సావిత్రి కూడా వాళ్ళతో ఉండటంతో ఇప్పుడు ఈ మాటలు వినిపిస్తున్నాయి.కొంత మంది ఆమెని తమ కెమెరాలో కూడా బంధించారు. ఇక మెగా ఫ్యాన్స్ తో పాటు తెలుగు ప్రజలందరు కూడా క్లీన్ కార పేస్ ఎప్పుడెప్పడు చూస్తామా అనే క్యూరియాసిటీ తో ఉన్నారు.