English | Telugu
రజనీ, కమల్ ల మధ్య ఈ సారి పోటీ తప్పదా?
Updated : Jan 20, 2024
రజనీ కాంత్, కమల్ హాసన్ ఇద్దరు కూడా కేవలం తమిళనాడు వ్యాప్తంగానే కాకుండా ఇండియా వ్యాప్తంగా కూడా క్రేజ్ ఉన్న నటులు.ఆ ఇద్దరి నటుల అభిమానుల మధ్య చాలా సార్లు గొడవలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.కొన్ని ఏరియాల్లో ఐతే ఇద్దరి ఫ్యాన్స్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కూడా ఉంది.తమిళ బాక్స్ బాక్స్ ఆఫీస్ వద్ద ఆ ఇద్దరి సినిమాలు చాలా సార్లు తలపడ్డాయి. తాజాగా మరోసారి ఆ ఇద్దరి మధ్య పోటీ తప్పేలా లేదనే ఒక రూమర్ తమిళ చిత్ర సీమలో చక్కర్లు కొడుతుంది
కమల్ శంకర్ ల కాంబోలో వస్తున్న ఇండియన్ 2 (indian 2) షూటింగ్ ని కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉంది.ఇప్పుడు ఈ సినిమాని ఏప్రిల్ నెలలో ఒక మంచి డేట్ రిలీజ్ చెయ్యబోతున్నారనే మాటలు వినపడుతున్నాయి.ఇప్పుడు ఇండియన్ 2 డేట్ లోనే తలైవర్ నటిస్తున్న భారీ చిత్రం వేట్టాయన్ ( vettaiyan) ని కూడా రిలీజ్ చెయయబోతున్నారనే రూమర్స్ వినపడుతున్నాయి.
అయితే ఆ వార్త నిజం కాదని రజనీ మూవీ ఇంకా షూటింగ్ స్టేజి లోనే ఉంది కాబట్టి మిగతా పనులన్నీ ఏప్రిల్ లోపు పూర్తి చేసుకోవడం కష్టమని అంటున్నారు. ఒకవేళ రెండు ఒకేసారి వస్తే మాత్రం ఇద్దరు లెజెండ్స్ మధ్య పోటీ తప్పదు.రజనీ కి, కమల్ ఇద్దరికీ తెలుగు లో కూడా భారీ స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. ఆ ఇద్దరు నటించిన ఎన్నో సినిమాలు తెలుగు నాట శతదినోత్సవాలు జరుపుకున్నాయి.