English | Telugu

అప్పుడే ఓటీటీలోకి గుంటూరు కారం!

సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా 'గుంటూరు కారం' (Guntur Kaaram). హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో విడుదలైంది. సినిమాకి డివైడ్ టాక్ వచ్చినప్పటికీ.. ఇప్పటికే రూ.100 కోట్లకు పైగా షేర్ రాబట్టి సత్తా చాటింది. అయితే ఈ మూవీ త్వరలోనే ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

'గుంటూరు కారం' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అయితే థియేటర్లలో విడుదలైన నాలుగు వారాలకే ఈ సినిమా ఓటీటీలోకి అడుగుపెట్టనునందట. ఫిబ్రవరి 9 నుంచి 'గుంటూరు కారం' మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుందని న్యూస్ వినిపిస్తోంది. మరి ఇందులో వాస్తవం ఎంతో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాలి.