English | Telugu

జగదీష్‌ బెయిల్‌ కోసం విశ్వప్రయత్నం.. క్లారిటీ ఇవ్వని అల్లు అర్జున్ యూనిట్‌!

‘పుష్ప’ చిత్రంలో పుష్పరాజ్‌ అసిస్టెంట్‌ కేశవ పాత్రలో నటించిన జగదీష్‌ ఈ ఒక్క సినిమాతోనే కావాల్సినంత పాపులారిటీ సంపాదించుకున్నాడు. అతని క్యారెక్టర్‌కి అంత మంచి పేరు వచ్చింది. ఇప్పుడు అదే స్థాయిలో చెడ్డ పేరు కూడా మూటకట్టుకున్నాడు జగదీష్‌. ఓ జూనియర్‌ ఆర్టిస్ట్‌ ఆత్మహత్య కేసులో జగదీష్‌ అరెస్ట్‌ అయిన విషయం తెలిసిందే. దీంతో ‘పుష్ప2’ షూటింగ్‌ వాయిదా పడిరదని, జగదీష్‌ చెయ్యాల్సిన సీన్స్‌ వల్ల షూటింగ్‌ మరింత ఆలస్యం అవుతోందని, ఆగస్ట్‌ 15న ఈ సినిమా రిలీజ్‌ ఉండదనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 


ఇదిలా ఉండగా జగదీష్‌కి సంబంధించి ఓ కొత్త న్యూస్‌ ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది. అదేమిటంటే.. పుష్ప2లో జగదీష్‌పై చిత్రీకరించాల్సిన కొన్ని కీలక సన్నివేశాలను అత్యవసరంగా తియ్యాల్సిన అవసరం ఏర్పడడంతో అతన్ని బెయిల్‌ ద్వారా బయటికి తెచ్చే ప్రయత్నాలు మేకర్స్‌ చేస్తున్నారన్నదే ఆ న్యూస్‌. అయితే ఈ విషయంలో యూనిట్‌ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. మరోపక్క అల్లు అర్జున్‌ పాల్గొనే కొన్ని సీన్స్‌ను చిత్రీకరించేందుకు సుకుమార్‌ సిద్ధమవుతున్నాడని తెలుస్తోంది. ఈ సీన్స్‌కి జగదీష్‌ అవసరం ఉండకపోవచ్చని తెలుస్తోంది. జగదీష్‌ అరెస్ట్‌ అవ్వడం వల్ల షూటింగ్‌కి ఎలాంటి ఆటంకం లేదని, యధావిధిగా షెడ్యూల్‌ ప్రకారమే షూటింగ్‌, సినిమా రిలీజ్‌ అన్నీ ఉంటాయని యూనిట్‌ సభ్యులు అంటున్నారట. అయితే ఈ విషయంలో కూడా క్లారిటీ లేదు. ఏ విషయంలో క్లారిటీ ఉన్నా లేకపోయినా జగదీష్‌ను బెయిల్‌ ద్వారా బయటికి తెచ్చేందుకు మేకర్స్‌ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారనే వార్త మాత్రం మరింత గట్టిగా వినిపిస్తోంది.