English | Telugu
విజయ్ తో నందమూరి హీరో మల్టీస్టారర్!
Updated : Dec 13, 2023
కొంతకాలంగా మల్టీస్టారర్ సినిమాలు చేయడానికి హీరోలు ఆసక్తి చూపిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా ఇతర భాషల హీరోలతో కలిసి పని చేయడానికి కూడా సై అంటున్నారు. త్వరలో టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్, కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి ఓ మల్టీస్టారర్ కోసం చేతులు కలపబోతున్నట్లు తెలుస్తోంది.
'ప్రేమ ఇష్క్ కాదల్', 'సేనాపతి' వంటి చిత్రాలతో ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ పవన్ సాధినేని.. కళ్యాణ్ రామ్ కోసం ఒక కథని సిద్ధం చేశాడట. ఇందులో మరో హీరో పాత్ర కూడా ఉండగా, దాని కోసం విజయ్ సేతుపతిని రంగంలోకి దింపుతున్నారని సమాచారం. ఇప్పటికే కళ్యాణ్ రామ్, విజయ్ సేతుపతి నుంచి ఈ ప్రాజెక్ట్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని తెలుస్తోంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ మూవీ అనౌన్స్ మెంట్ త్వరలో రానుందని అంటున్నారు.