English | Telugu
తెలుగునాట 'పుష్ప-2' బిజినెస్.. 'ఆర్ఆర్ఆర్' కంటే ఎక్కువే!
Updated : Oct 9, 2024
టాక్ తో సంబంధం లేకుండా రూ.1000 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి, పాన్ ఇండియా వైడ్ గా సంచలనం సృష్టించగల సత్తా ఉన్న సినిమా అని అందరూ బలంగా నమ్ముతున్న చిత్రం 'పుష్ప-2'. అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 'పుష్ప-1' సినిమా, 2021 డిసెంబర్ లో విడుదలై ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు దానికి కొనసాగింపుగా రూపొందుతోన్న 'పుష్ప-2' ఈ డిసెంబర్ లో థియేటర్లలో అడుగుపెట్టనుంది. (Pushpa 2 The Rule)
'పుష్ప-2' సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే బిజినెస్ భారీ స్థాయిలో జరుగుతోంది. ముఖ్యంగా తెలుగునాట ఈ మూవీ థియేట్రికల్ బిజినెస్ సరికొత్త రికార్డులు సృష్టిస్తోందని, ఏకంగా 'ఆర్ఆర్ఆర్'ని మించిపోయిందని తెలుస్తోంది. నైజాంలో రూ.80 కోట్లు, ఆంధ్రాలో రూ.85 కోట్లు, సీడెడ్ లో రూ.30 కోట్ల బిజినెస్ చేసినట్లు సమాచారం. అంటే తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా రూ.195 కోట్ల బిజినెస్ చేసింది. ఇది ఆర్ఆర్ఆర్ (రూ.191 కోట్లు) కంటే ఎక్కువ కావడం విశేషం.
ఈ బిజినెస్ లెక్కల ప్రకారం తెలుగునాట పుష్ప-2 బ్రేక్ ఈవెన్ సాధించాలంటే దాదాపు రూ.200 కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది. ఇప్పటిదాకా తెలుగు స్టేట్స్ లో 'ఆర్ఆర్ఆర్', 'బాహుబలి-2' మాత్రమే రూ.200 కోట్లకు పైగా షేర్ రాబట్టాయి. 'కల్కి' రూ.180 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. మరి తెలుగునాట 'పుష్ప-2' ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.