English | Telugu
మెగాస్టార్ ఊటీ ప్లాన్ ఏమిటి?.. అది రామ్‌చరణ్, ఉపాసన కోసమేనా?
Updated : Oct 11, 2024
నిత్యం షూటింగులతో బిజీగా ఉండే సినిమా తారలు ఆటవిడుపుగా అప్పుడప్పుడు ఇతర ప్రాంతాలకు వెళ్లి సేద తీరుతుంటారు. ముఖ్యంగా వేసవిలో ఎండ తీవ్రత నుంచి దూరంగా ఉండేందుకు టాలీవుడ్ సెలబ్రిటీస్ ఊటీకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటారు. అందుకోసం అక్కడ విలాసవంతమైన భవనాలను నిర్మించుకుంటారు. కొందరు తారలు ఫామ్ హౌస్‌లను కూడా నిర్మించారు. ఇప్పటికే హిందీ, తమిళ్, కన్నడ ఇండస్ట్రీలకు చెందిన కొందరు సెలబ్రిటీలకు ఊటీలో ఫామ్ హౌస్‌లు ఉన్నాయి. ఇప్పుడు ఆ లిస్ట్‌లో మెగాస్టార్ కూడా చేరబోతున్నారని సమాచారం. ఆమధ్య ఊటీలోని కొండ ప్రాంతంలో ఐదున్నర ఎకరాల విస్తీర్ణం కలిగిన ఓ ప్రాపర్టీని కొనుగోలు చేశారని సమాచారం. ఊటీ శివారు ప్రాంతంలో చుట్టూ టీ గార్డెన్స్ కలిగి ఉన్న ఈ స్థలం విలువ రూ.16 కోట్ల వరకు ఉంటుంది.
హైదరాబాద్, గోవా, విశాఖపట్నం, చెన్నయ్ వంటి ప్రధాన నగరాల్లో చిరంజీవికి ఇప్పటికే సొంత భవనాలు ఉన్నాయి. ఊటీలో కొత్తగా కొనుగోలు చేసిన స్థలాన్ని రామ్‌చరణ్, ఉపాసన కూడా చూసి వచ్చారని తెలుస్తోంది. మంచి ఆర్కిటెక్ట్‌తో అక్కడ ఒక అందమైన ఫామ్‌హౌస్ నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయం ఇంకా కన్‌ఫర్మ్ అవ్వలేదు. ఇదిలా ఉంటే.. చిరంజీవికి బెంగళూరు కెంపెగూడ అంతర్జాతీయ విమానాశ్రయం దగ్గరలోని దేవనహళ్లిలో ఓ విలాసవంతమైన ఫామ్‌హౌస్ ఉందట. తాజాగా ఊటీలో కొనుగోలు చేసిన స్థలంలో ఏం నిర్మించబోతున్నారు అనేది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. అది రామ్‌చరణ్, ఉపాసనల కోసమే చిరంజీవి కొనుగోలు చేశారని, వారి కోసం ఓ అందమైన ఫామ్‌హౌస్ నిర్మాణాన్ని త్వరలో చేపడతారని సమాచారం.