English | Telugu
కేశవ అరెస్టు.. ఇరకాటంలో సుకుమార్, త్రివిక్రమ్.. అది నానికి ప్లస్ అవుతుందా?
Updated : Dec 13, 2023
మహేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘గుంటూరు కారం’ సంక్రాంతికి విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్‌తో సినిమా చెయ్యాలని త్రివిక్రమ్ డిసైడ్ అయిన విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేశాడు త్రివిక్రమ్. అన్నీ ప్లాన్ చేసుకొని సెట్స్‌కి వెళదామనుకున్న సమయంలోనే ఒక్క ఘటనతో అన్నీ తారుమారయ్యాయి.
అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘పుష్ప2’ వచ్చే ఆగస్ట్ 15కి రిలీజ్ చెయ్యాలన్న ఉద్దేశంతోనే శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాలో కేశవ అనే కీలక పాత్ర పోషిస్తున్న నటుడు జగదీష్.. ఓ అమ్మాయి ఆత్మహత్య కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ‘పుష్ప’ సినిమా మొదటి భాగంలో అల్లు అర్జున్ పక్కన ఉండే క్యారెక్టర్ అతనిదే కావడంతో పాటు సెకండ్ పార్ట్‌లో కేశవ పాత్రకి సంబంధించి చాలా సన్నివేశాలు ఉన్నాయట. అతని క్యారెక్టర్‌కి సంబంధించిన షూటింగ్ ఇంకా మొదలుపెట్టలేదు. జగదీష్ అరెస్టుతో షూటింగ్ ఆలస్యం అవుతోందట. దీని కారణంగా బన్నితో త్రివిక్రమ్ చెయ్యాలనుకుంటున్న సినిమా కూడా లేట్ అయ్యే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా.. ఈ గ్యాప్‌లో నానితో ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చేసేందుకు త్రివిక్రమ్ ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తాజా సమాచారం. ఇప్పటికే నానికి స్టోరీ వినిపించడం, స్టోరీ ఓకే అవ్వడం జరిగిపోయిందని తెలుస్తోంది. త్వరలోనే నాని, త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ‘పుష్ప2’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న జగదీష్ అరెస్టు వల్ల అటు సుకుమార్, ఇటు బన్నితో సినిమా చెయ్యాలనుకున్న త్రివిక్రమ్ ఇద్దరూ ఇరకాటంలో పడ్డారు. ఇది నానికి ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.