English | Telugu

‘దేవర’కు కొత్త చిక్కులు.. అందుకే షూటింగ్‌ ఆపారట!

ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా మూవీ ‘దేవర’పై అంచనాలు ఎంతో భారీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇంకా షూటింగ్‌ దశలోనే ఉంది. కొరటాల శివ కెరీర్‌లోనే డిఫరెంట్‌ జోనర్‌లో చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్‌ జనవరిలో సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ‘దేవర’కి సంబంధించి ఒక న్యూస్‌ ఇప్పుడు మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే.. సినిమా షూటింగ్‌ కొనసాగించాలంటే ఫండిరగ్‌ ఎంతో ఆవశ్యమని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించి ఎన్నో రోజులు షూటింగ్‌ జరిగింది. ఇప్పటికే కోట్ల రూపాయలు ఈ సినిమాకి వెచ్చించారని తెలుస్తోంది. డబ్బంతా యాక్షన్‌ సీక్వెన్స్‌లు తియ్యడానికే సరిపోయిందనే రూమర్‌ వినిపిస్తోంది. ఈ సినిమాని రెండు భాగాలుగా విడుదల చెయ్యాలనే నిర్ణయం తీసుకోవడానికి కారణం కూడా అదేనట.
ఇటీవల ఈ సినిమా యూనిట్‌కి సెలవులు ప్రకటించారనే వార్త కూడా వచ్చింది. నాన్‌స్టాప్‌గా షూటింగ్‌ చెయ్యడం వల్ల యూనిట్‌ సభ్యులు బాగా అలసిపోయారని, అందుకే సెలవులు ఇచ్చారని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే అందుతున్న సమాచారం మేరకు సినిమాకి ఫండిరగ్‌ లేకపోవడం వల్లే షూటింగ్‌కి బ్రేక్‌ ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది. అందుకే సినిమా ఎలా ఉండబోతోందనే క్లారిటీ ఇచ్చేందుకు గ్లింప్స్‌ను కట్‌ చేస్తున్నారని తెలుస్తోంది. తద్వారా ఫండిరగ్‌ వచ్చే అవకాశం ఉందని యూనిట్‌ భావిస్తోందట. ఈ సినిమాను నిర్మిస్తోంది కొరటాల శివ స్నేహితులే కావడం విశేషం. ఇదే సినిమాను బిగ్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ చేసి ఉంటే ఫండిరగ్‌ సమస్య అనేది వచ్చేది కాదని కొందరి అభిప్రాయం. 
షూటింగ్‌ పూర్తి చేసి సమ్మర్‌లో రిలీజ్‌ చెయ్యాలన్నది మేకర్స్‌ ప్లాన్‌. అయితే ఫండిరగ్‌ సమస్య అంటూ వస్తున్న వార్తల వల్ల షూటింగ్‌ మరింత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. బయట వినిపిస్తున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలీదుగానీ, సడన్‌గా షూటింగ్‌కి బ్రేక్‌ ఇవ్వడం మాత్రం సినిమాపై స్ప్రెడ్‌ అవుతున్న రూమర్స్‌ నిజమేనేమో అనే సందేహాన్ని కలిగిస్తోంది.