English | Telugu
ట్రాప్‌కి గురైన నిర్మాత.. సెటిల్‌మెంట్‌తో తెలివిగా బయట పడిన వైనం!
Updated : Oct 7, 2024
బయట ప్రపంచంతో పోలిస్తే.. సినిమా రంగంలో సహజీవనాలు, విడాకులు, ప్రేమ వివాదాలు ఎక్కువ అనిపిస్తాయి. సమాజంలో ఇప్పుడు ఇవన్నీ మామూలు విషయాలే అయినా.. వాళ్ళు సినిమా సెలబ్రిటీస్ కాబట్టి అవి ఎక్కువగా ఫోకస్ అవుతుంటాయి. సినిమా పుట్టిన నాటి నుంచి ఇలాంటివి ఇండస్ట్రీలో జరుగుతూనే ఉన్నాయి. 24 క్రాఫ్ట్స్‌లో పనిచేసే కొందరు మహిళలు.. బడా నిర్మాతలను ట్రాప్ చేసే పనిలోనే ఉంటారు. వారిని తమ దారిలోకి తెచ్చుకొని ఆ నిర్మాతల నుంచి కావాల్సినంత దండుకొని మొహం చాటేస్తుంటారు. అలాంటి ఓ ఘటన ఆమధ్య ఓ నిర్మాత విషయంలో జరిగింది. అది డిఎన్‌ఎ టెస్టు వరకూ వెళ్లిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇద్దరూ రాజీకి రావడం, ఒక సెటిల్‌మెంట్‌కి ఆ అమ్మాయి ఒప్పుకోవడంతో అది బయటి ప్రపంచానికి తెలీకుండా క్లోజ్ అయిపోయింది.
తాజాగా మరో నిర్మాత అలాంటి ట్రాప్‌లో ఇరుక్కున్నాడని తెలుస్తోంది. అలాంటి వాటిలో ఎక్స్‌పర్ట్ అయిన ఆ అమ్మాయి నిర్మాతను ముగ్గులోకి లాగింది. వ్యాపార రంగంలో ఎంతో సంపాదించిన ఆ నిర్మాత సినిమాలంటే ప్యాషన్‌తో ఇండస్ట్రీకి వచ్చారు. ఒక సినిమా తీసి సక్సెస్‌ఫుల్‌గా రిలీజ్ చేశారు. రెండో సినిమా ప్లానింగ్‌లో ఉన్న సమయంలో ఆ యూనిట్‌లోని ఓ అమ్మాయి నిర్మాతను ట్రాప్ చేసింది. చాలా రోజులు ఇద్దరూ బాగా ఎంజాయ్ చేశారు. ఆ తర్వాత పరిస్థితి అర్థం చేసుకున్న ఆ నిర్మాత కళ్లు తెరిచాడు. ఎలాంటి హడావిడి లేకుండా ఆమెతో సెటిల్‌మెంట్ చేసుకున్నాడు. దాని కోసమే ఎదురుచూస్తున్నా అన్నట్టుగా ఆ అమ్మాయి కూడా వెంటనే ఒప్పుకుంది. అలా ముందుగానే మేలుకున్నాడు ఆ నిర్మాత.