English | Telugu
పరశురామ్ దర్శకత్వంలో టిల్లు.. క్రేజీ కాంబో..!
Updated : Oct 7, 2024
'డీజే టిల్లు', 'టిల్లు స్క్వేర్' సినిమాలతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకున్న సిద్ధు జొన్నలగడ్డ చేతిలో ప్రస్తుతం 'జాక్', 'తెలుసు కదా', 'టిల్లు క్యూబ్' సినిమాలు ఉన్నాయి. వీటిలో పాటు తాజాగా మరో ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. (Siddhu Jonnalagadda)
'ఫ్యామిలీ స్టార్' పరాజయం తర్వాత దర్శకుడు పరశురామ్ నెక్స్ట్ మూవీ ఏంటనే సస్పెన్స్ నెలకొంది. మధ్యలో తమిళ హీరో కార్తీ వంటి వారి పేర్లు వినిపించినప్పటికీ.. ఏదీ ఫైనల్ కాలేదు. ఇప్పుడు అనూహ్యంగా సిద్ధు పేరు తెరపైకి వచ్చింది. సిద్ధు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించడానికి దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కథా చర్చలు జరిగినట్లు టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించే అవకాశముంది అంటున్నారు.