English | Telugu
నటి ప్రగతి రెండో వివాహం.. వరుడు ఎవరో తెలుసా?
Updated : Oct 28, 2023
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో వున్న కొద్దిమంది టాలెంటెడ్ లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టులలో నటి ప్రగతి ఒకరు..సెంటిమెంట్ ,కామెడీ, ఎమోషన్ ఇలా వైవిధ్యమైన పాత్రలను సైతం అలవోకగా పోషిస్తూ ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా లో కూడా యాక్టీవ్ గా వుంటూ వస్తుంది. తెలుగు సినీ పరిశ్రమతో 20 సంవత్సరాలకి పైగా అనుబంధమున్న నటి ప్రగతి. తనకి సుమారు 21 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే చెన్నైకి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. కొడుకు కూతురు పుట్టిన తర్వాత భర్తతో విబేధాలు కారణంగా విడాకులు తీసుకొంది.
అప్పటి నుంచి తన పిల్లల కోసం మళ్ళీ పెళ్లిచేసుకోకుండా సినిమాల్లో నటిస్తూనే పిల్లల బాధ్యతలని చూసుకుంది. ఇప్పుడు వాళ్ళు పెద్ద వాళ్ళు అయ్యారు. ఇక తను పెళ్లి చేసుకోవాలని చూస్తుందని, తెలుగు సినీ పరిశ్రమకే చెందిన ఒక బడా నిర్మాతని ప్రగతి పెళ్లి చేసుకోబోతుందనే రూమర్ ఫిలిం సర్కిల్స్ లో వినబడుతుంది.
ప్రగతి ఇప్పటి వరకు తెలుగు,తమిళ,మలయాళ భాషల్లో కలిపి సుమారు 150 సినిమాల దాకా చేసింది. అన్ని సినిమాల్లోను మంచి ప్రాధాన్యం ఉన్న పాత్రలనే పోషించింది. ప్రస్తుత యూత్ కి న్యూ జనరేషన్ మదర్ గా ప్రగతి పర్ఫెక్ట్ గా నటించి ప్రేక్షకుల మన్ననలని పొందింది. కొన్ని సంవత్సరాల నుంచి ప్రగతి సోషల్ మీడియా ద్వారా అభిమానులకి దగ్గరగా ఉంటూ వస్తుంది. మరి ప్రగతి నిజంగానే ఒక బడా నిర్మాతతో రెండో పెళ్లికి సిద్ధం అయ్యిందా లేక అవన్నీ ఒట్టి పుకార్ల అనేది ప్రగతి స్వయంగా మీడియా ముందుకు వచ్చి చెప్తే గాని తెలియదు.