English | Telugu
ప్రభాస్ సినిమాకి రాజమౌళి కథ ఎవరిది
Updated : Apr 6, 2011
అలా కొనుగోలు చేసిన ఆ కథను రాసింది తన తండ్రేనని రాజమౌళి చెప్పుకుంటున్నారని కూడా ఫిలిం నగర్ లో ప్రచారం జరుగుతోంది. సినిమా టైటిల్ కార్డ్స్ లో కథకుడిగా తండ్రి పేరే వేస్తారనికూడా ఫిలిం నగర్ వాసులంటున్నారు. ఇది ఎంతవరకూ నిజమో కాలమే చెప్పాలి. ఆ కథతో నిర్మించే సినిమాకి మాత్రం దాదాపు వంద కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ను కేటాయించటం జరిగిందట. ఈ ప్రభాస్ చిత్రం రానున్న నవంబర్ నెలలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం నాని హీరోగా, సమంత హీరోయిన్ గా, ప్రముఖ కన్నడ నటుడు సుదీప్ విలన్ గా నిర్మిస్తున్న "ఈగ" సినిమాతో రాజమౌళి బిజీగా ఉన్నారు.