English | Telugu
చరణ్ జిమ్ చేసేది కాజల్ కోసమా
Updated : Apr 6, 2011
చరణ్ జిమ్ చేసేది కాజల్ కోసమా అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఫిలిం నగర్ వాసులు. వివరాల్లోకి వెళితే యువ హీరో రామ్ చరణ్ తాను సంపత్ నంది దర్శకత్వంలో, మెగా సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, యన్ వి ప్రసాద్, పరాస్ జైన్ నిర్మిస్తున్న"రచ్చ" సినిమా కోసం అమెరికా ఫ్లోరిడాలోని మియామీలో ఒక అంతర్జాతీయ జిమ్ లో శిక్షణ తీసుకుంటున్నాడు. అందుకని తన పుట్టిన రోజును కూడా రామ్ చరణ్ అక్కడే ఒంటరిగా జరుపుకున్నాడు. రామ్ చరణ్ తల్లిదండ్రులు కూడా ఫోన్ లోనే అతనికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇలా అని అందరూ అనుకున్నారు. కానీ అక్కడ జరిగింది వేరట.
రామ్ చరణ్ సరసన "మగధీర" చిత్రంలో హీరోయిన్ మిత్రవిందగా నటించిన కాజల్ అగర్వాల్ మాత్రం ప్రత్యేకంగా అమెరికాకు వెళ్ళి బర్త్ డే కేక్ కొన్ని రామ్ చరణ్ తో కట్ చేయించి అక్కడే చరణ్ తో మూడు రోజులు గడిపిందట. కేవలం కేక్ ఖర్చు మాత్రమే కాజల్ పెట్టుకుంటే అక్కడికి రాను పోను ఫ్లైట్ ఛార్జీలు, షాపింగ్ ఖర్చులూ రామ్ చరణ్ పెట్టుకున్నాడట. ఇది కేవలం స్నేహం మాత్రమేనంటారా...? లేక తనకు "మగధీర" వంటి బ్లాక్ బస్టర్ హిట్టిచ్చి తన కెరీర్ ను మలుపుతిప్పిన హీరో మీద కృతజ్ఞత అంటారా...? లేక అంతకు మించి ఇంకేదన్నా ఉందంటారా...? అందుకే చరణ్ అక్కడ జిమ్ చేసేది "రచ్చ" సినిమా కోసమా...? లేక కాజల్ కోసమా అని ఫిలిం నగర్ వర్గాలనుకుంటున్నారు.