English | Telugu

ప్రభాస్ పెళ్ళంట

ప్రభాస్ పెళ్ళంట. వివరాల్లోకి వెళితే తెలుగు యువ హీరోల్లో బాగా ముదిరిపోతున్న హీరో ప్రభాస్. ఇప్పటికే ప్రభాస్ కి 34 యేళ్ళు వచ్చాయి. పోయిన యేడాది ప్రభాస్ పెళ్ళవుతుందనుకుంటే కొన్ని కారణాల వల్ల కాలేదు. ప్రభాస్ అభిమానులు "మా హీరో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పెళ్ళెప్పుడు" అని ఎదురుచూస్తున్నారు. ఈ సంవత్సరం అంటే 2012 లో ప్రభాస్ వివాహం అవుతుందని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి.

ఇంజినీరింగ్ చదువుతున్న 22 యేళ్ళ ఒక అందమైన అమ్మాయితో ప్రభాస్ పెళ్ళి ఈ యేడాదే కానుందని అంటున్నారు. పెళ్ళి మాటలు జరుగుతున్నాయట. అవన్నీ ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయని కూడా తెలిసింది. వీళ్ళిద్దరికీ వయసులో 12 యేళ్ళు తేడా ఉంది. ఈ విషయం ఇంకా ప్రభాస్ తరపున ఇంకా ఎవరూ ధృవీకరించలేదు. ఏదేమైనా ప్రభాస్ రాజు ఒక ఇంటివాడవుతున్నందుకు ఆయన అభిమానులు చాలా ఆనందపడతారనటంలో సందేహం అక్కరలేదు.