English | Telugu

చిరుతో నయన్.. ఈ సారి ఏంటో?

'జవాన్'తో బాలీవుడ్ లోనూ తనదైన ముద్రవేశారు లేడీ సూపర్ స్టార్ నయనతార. ఇందులో నర్మదగా శక్తిమంతమైన పాత్రలో కనిపించి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అందుకున్నారామె. 

ఇదిలా ఉంటే, తాజాగా నయన్ ఓ తెలుగు చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. అది కూడా.. మెగాస్టార్ చిరంజీవి సినిమాలో. ఆ వివరాల్లోకి వెళితే.. బింబిసార దర్శకుడు వశిష్ఠ కాంబినేషన్ లో చిరు ఓ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఇప్పటికే అనుష్క, మృణాళ్ ఠాకూర్ నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఇందులో నయన్ కూడా కనిపించే అవకాశముందట. ఇదో స్పెషల్ రోల్ అని టాక్. కాగా, చిరంజీవితో నయనతార ఇప్పటికే రెండు సినిమాలు చేసింది. సైరా (2019)లో చిరుకి భార్యగా కనిపించిన నయన్.. గాడ్ ఫాదర్ (2022)లో చెల్లిగా అలరించింది. మరి.. ఈ సారి చిరు పక్కన ఎలాంటి పాత్రలో ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి. త్వరలోనే చిరు, వశిష్ఠ కాంబో మూవీలో నయన్ ఎంట్రీపై క్లారిటీ రానుంది.