English | Telugu

షాకింగ్‌.. ఆ సినిమాకి రెమ్యునరేషన్‌ వద్దంటున్న ప్రభాస్‌!

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ‘సలార్‌’తో భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా రూ.500 కోట్లు క్రాస్‌ చేసి బ్రేక్‌ ఈవెన్‌ దిశగా పరుగులు తీస్తోంది. చాలా కాలం తర్వాత ప్రభాస్‌కి భారీ విజయం దక్కడంతో డార్లింగ్‌ ఫ్యాన్స్‌ సంతోషంతో సంబరాలు చేసుకుంటున్నారు. 

ఇదిలా ఉంటే.. తాజాగా ప్రభాస్‌ కొత్త సినిమాకి సంబంధించిన ఓ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్‌. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకి సంబంధించి ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేసి సంక్రాంతికి ఈ సినిమా టైటిల్‌ను, ప్రభాస్‌ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తామని ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమాకి ‘రాజా డీలక్స్‌’ అనే టైటిల్‌ అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో మాళవిక మోహనన్‌, నిధి అగర్వాల్‌, రిధీ కుమార్‌ హీరోయిన్లుగా ఎంపికయ్యారని సమాచారం. ‘సలార్‌’ వంటి భారీ సినిమా తర్వాత ప్రభాస్‌తో చేస్తున్న ఈ సినిమా హార్రర్‌ కామెడీ థ్రిల్లర్‌గా ఉండబోతోందంటున్నారు. రూ.150 కోట్లలోపే ఈ సినిమా బడ్జెట్‌ ఉంటుందని తెలుస్తోంది. 

ఈ సినిమాకి సంబంధించి మరో న్యూస్‌ కూడా ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో నటించినందుకు ప్రభాస్‌ రెమ్యునరేషన్‌ తీసుకోవడం లేదట. అయితే సినిమాకి వచ్చిన ప్రాఫిట్‌లో బడ్జెట్‌ తీసేసిన తర్వాత మిగిలిన ఎమౌంట్‌లో ప్రభాస్‌కి వాటా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ విషయం అఫీషియల్‌గా ఎనౌన్స్‌ చేయనప్పటికీ ఆ విధంగా ఒప్పందం జరిగిందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.