English | Telugu

నాని సరసన బుట్టబొమ్మ.. సెట్ అవుతుందా!

మొన్నటిదాకా బుట్టబొమ్మగా ఒక వెలుగు వెలిగిన పూజా హెగ్డే వరుస పరాజయాలతో కొంతకాలంగా వెనుకబడిపోయింది. గతేడాది వరకు వరుసగా స్టార్ హీరోల సినిమాలలో సందడి చేసిన పూజ.. ఏవో కారణాల వల్ల 'గుంటూరు కారం', 'ఉస్తాద్ భగత్ సింగ్' వంటి బడా సినిమాలను చేజార్చుకుంది. టాలీవుడ్ లో జోరు తగ్గింది. బాలీవుడ్ లో అంతగా కలిసి రావడంలేదు. ఇలాంటి తరుణంలో ఆమెకి నేచురల్ నానితో జోడీ కట్టే అవకాశం వచ్చిందని తెలుస్తోంది.

ఈ ఏడాది 'దసరా'తో బ్లాక్ బస్టర్ అందుకున్న నాని ప్రస్తుతం 'హాయ్ నాన్న' అనే సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత 'అంటే సుంద‌రానికీ' దర్శకుడు వివేక్ ఆత్రేయతో మరో సినిమా చేయనున్నాడు. డీవీవీ ఎంటర్టైన్మెంట్ నిర్మించనున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజను ఎంపిక చేసినట్లు సమాచారం. అదే నిజమైతే నాని, పూజ కలయికలో ఇదే మొదటి సినిమా అవుతుంది. నాని, పూజల కొత్త కాంబో స్క్రీన్ పై ఎలా ఉంటుందో చూడాలి.