English | Telugu

లేటు వయసులో నగ్మా పెళ్లి.. వరుడు ఎవరై ఉంటారు?

సల్మాన్‌ ఖాన్‌ హీరోగా 1990లో వచ్చిన ‘బాఘి’ చిత్రంతో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసిన అందాల నటి నగ్మా తెలుగులో సుమన్‌ హీరోగా వచ్చిన ‘పెద్దింటల్లుడు’ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రవేశించింది. తెలుగులో టాప్‌ హీరోలందరి సరసన ఎన్నో సూపర్‌హిట్‌ సినిమాల్లో నటించింది. ఆమె చివరగా 2008లో భోజ్‌పురి సినిమాలో నటించింది. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించింది. 48 ఏళ్ళ నగ్మా ఇప్పటివరకు పెళ్ళి చేసుకోలేదు. కానీ, ఎంతో మందితో ప్రేమాయాణం సాగించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. వారిలో శరత్‌కుమార్‌, సౌరవ్‌ గంగూలి, రవికిషన్‌, మనోజ్‌ తివారి పేర్లు వినిపించాయి. అయితే ఈ నలుగురూ పెళ్ళయిన వారే. సౌరవ్‌ గంగూలితో ప్రేమ.. పెళ్ళి వరకు వెళ్లి ఆగిపోయిందట. 
తాజాగా నగ్మా తన పెళ్ళి గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్ళి చేసుకోకూడదు అనే ఆలోచన తనకు లేదని, తనకంటూ ఓ తోడు ఉండాలి, పిల్లలు, కుటుంబం ఉండాలి అనే ఆశ ఉంది. టైమ్‌ కలిసొస్తే త్వరలోనే పెళ్ళి చేసుకుంటానేమో అంటోంది నగ్మా. మరి లేటు వయసులో పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్న నగ్మా చేయందుకునే ఆ వరుడు ఎవరో తెలుసుకోవాలంటే కొంతకాలం ఆగాల్సిందే.