English | Telugu
అతనితో సినిమా చేసేందుకు మళ్ళీ ఎవరైనా ధైర్యం చేస్తారా?
Updated : Aug 31, 2023
ప్రభాస్, ఎన్టీఆర్, వెంకటేశ్ వంటి టాప్ హీరోలతో సినిమాలు తీసిన మెహర్ రమేష్ చాలా గ్యాప్ తర్వాత చేసిన సినిమా ‘భోళాశంకర్’. వెంకటేశ్‌తో అతను చేసిన చివరి సినిమా ‘షాడో’. 2013లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అది డిజాస్టర్ కావడంతో మెహర్‌తో సినిమా చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అలాంటిది మెగాస్టార్ చిరంజీవి అతనికి ఒక అవకాశం ఇచ్చారు. అయితే మెహర్ లాక్‌డౌన్ సమయంలో చేసిన సేవలను గుర్తించి మెగాస్టార్ అతనికి అవకాశం ఇచ్చారు. లాక్‌డౌన్‌లో తన ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది సినీ కార్మికులకు నిత్యావసరాలు అందించారు. ఆ కార్యక్రమం సక్రమంగా జరిగేందుకు మెహర్ ఎంతో కృషి చేశాడు. దాన్ని గుర్తించిన చిరంజీవి ఎంతోకాలంగా ఖాళీగా ఉన్న మెహర్‌కి ‘వేదాళం’ రీమేక్ చేసే ఛాన్స్ ఇచ్చారు. అయితే దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో మెహర్ విఫలమయ్యాడు. ఈ సినిమాని కూడా ఒక డిజాస్టర్‌గా నిలబెట్టాడు. ఆ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజునుంచే అతను ఎవ్వరికీ కనిపించడం లేదు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు మెహర్ రమేష్ ఎక్కడ? అంటూ పోస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియాలోనే కాదు, చిత్ర పరిశ్రమలోనూ ఇదే ప్రశ్న వినిపిస్తోంది. మరి మెహర్ ఎక్కడున్నాడు? మళ్ళీ అతనితో సినిమా చేసే ధైర్యం ఏ హీరోకిగానీ, నిర్మాతకిగానీ ఉందా?