English | Telugu
రవితేజ సరసన పూజా హెగ్డే.. లక్ మారేనా?
Updated : Jul 24, 2023
వరుసగా స్టార్ హీరోల సినిమాలలో సందడి చేసిన పూజా హెగ్డే వరుస పరాజయాలతో కొంతకాలంగా వెనుకబడిపోయింది. బాలీవుడ్ అంతగా కలిసి రావడంలేదు. టాలీవుడ్ లో ఏవో కారణాల వల్ల 'గుంటూరు కారం', 'ఉస్తాద్ భగత్ సింగ్' వంటి బడా సినిమాలను చేజార్చుకుంది. మొన్నటిదాకా బుట్టబొమ్మగా ఒక వెలుగు వెలిగిన పూజ కెరీర్ ఒక్కసారిగా ఊహించని మలుపు తీసుకుంది. ఇలాంటి సమయంలో ఆమెకు మాస్ మహారాజా రవితేజ సినిమాలో నటించే అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది.
'డాన్ శీను', 'బలుపు', 'క్రాక్' వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత మాస్ మహారాజ రవితేజ, దర్శకుడు గోపీచంద్ మలినేని నాలుగోసారి చేతులు కలిపారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రకటన ఇటీవల వచ్చింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ పూజను ఎంపిక చేసినట్లు సమాచారం. అదే నిజమైతే రవితేజ సరసన పూజ నటించే మొదటి సినిమా ఇదే అవుతుంది. ఈ సినిమా విజయం పూజకి చాలా కీలకం. ఈ మూవీతో కమ్ బ్యాక్ ఇచ్చి పూజ మునుపటి వైభవాన్ని చూస్తుందేమో చూడాలి.