English | Telugu

బిగ్ షాక్.. గ్లింప్స్‌ తో ప్రేక్షకులను మోసం చేసిన 'కంగువా' టీమ్!

తెలుగు సినీ పరిశ్రమకు 'బాహుబలి-2', 'ఆర్ఆర్ఆర్', కన్నడ పరిశ్రమకు 'కేజీఎఫ్-2' రూపంలో వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసిన పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. తమిళ పరిశ్రమ నుంచి ఇంతవరకు ఒక్క సినిమా కూడా ఆ ఫీట్ సాధించలేదు. ఆ లోటుని భర్తీ చేసే చిత్రం 'కంగువా' అవుతుందని తమిళ సినీ వర్గాలు నమ్ముతున్నాయి.

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం 'కంగువా'. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేష‌న్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై ప్రకటనతోనే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక రీసెంట్ గా విడుదలైన గ్లింప్స్‌ ఆ అంచనాలను అమాంతం పెంచేసింది. ఇప్పటిదాకా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చేసిన దర్శకుడు శివ, ఇప్పుడు సూర్యతో వైవిద్యభరితమైన సినిమా చేస్తున్నాడని, ఈ చిత్రంతో శివ-సూర్య కాంబో పాన్ ఇండియా రేంజ్ లో సంచలనాలు సృష్టించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. కంగువా గ్లింప్స్‌ లో ఏదైతే చూపించారో అదసలు కథా నేపథ్యం కాదంట. అందరూ అనుకుంటున్నట్లుగా ఇది పీరియడ్ డ్రామా ఫిల్మ్ కాదని, సమకాలీన నేపథ్యంతో వస్తోన్న సినిమానే అని అంటున్నారు. అదే నిజమైతే గ్లింప్స్‌ తో కంగువా టీం ప్రేక్షకులను మోసం చేసినట్లే. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే టీజర్, ట్రైలర్ వచ్చే వరకు ఆగాల్సిందే.