Read more!

English | Telugu

గోపీచంద్ పెళ్ళి

ప్రముఖ దర్శకులు స్వర్గీయ టి.కృష్ణ గారి కుమారుడు, తెలుగు సినీ రమగంలోకి హీరోగా ప్రవేశించి, విలన్ గా రాణించి, మళ్ళీ హీరోగా మారి తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్న యువ హీరో గోపీచంద్ త్వరలో పెళ్ళికొడుకు కాబోతున్నాడు.గొపీచంద్ తో మూడు సినిమాలు నిర్మించిన నిర్మాత వెనిగళ్ళ ఆనందప్రసాద్ కుమార్తెతో గోపీచంద్ వివాహం జరుగుతుందని ఫిలిం నగర్ వర్గాల భోగట్టా.ఈ విషయంపై గత కొంత కాలంగా ఇరు వర్గాల పెద్దలూ చర్చలు జరుపుతున్నారట.ఈ యేడాది చివర్లో గోపీచంద్ వివాహం జరుగుతుందని సమాచారం.ఇప్పటికే యన్ టి ఆర్, అల్లు అర్జున్ ఇద్దరూపెళ్ళికొడుకులవుతున్నారు.వారితోపాటుగోపీచంద్కూడా ఒకింటివాడవుతున్నాడన్నమాట.ఇక ప్రభాస్ వంటి బ్యాచులర్ హీరోలు కూడా త్వరలో పెళ్ళికొడుకులవుతారేమో చూడాలి.