English | Telugu
అల్లు అర్జున్ సంగీత్ లో పవన్ ఎందుకు రాలేదు...?
Updated : Mar 6, 2011
మాములుగా మన బంధువుల ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే మనం కచ్చితంగా ఆ ఫంక్షన్ కి వెళతాం. అలాంటిది అల్లు అర్జున్ తన జీవితంలో చేసుకునే వివాహానికి సంబంధించిన "అల్లు అర్జున్ సంగీత్" ఫంక్షన్ కి అతని చిన్న మామలు పవన్ కళ్యాణ్, నాగేంద్ర బాబు, ఇద్దరూ రాలేదు. నాగబాబు "ఆరెంజ్" సినిమా ఫ్లాపవటంతో చాలా డిప్రెషన్ తో ఖాళీగానే ఉన్నాడని సమాచారం. అలాగే పవన్ కళ్యాణ్ తాను హీరోగా నటిస్తున్న "తీన్ మార్" చిత్రం షూటింగ్ లో బిజీగా ఉండటం వల్ల ఆ ఫంక్షన్ కి రాలేకపోయాడని సమాచారం.
"తీన్ మార్" చిత్రంకోసం హైదరాబాద్ ఊరి చివర ఒక భారీ సెట్ వేసి అక్కడ రాత్రి వేళలో మాత్రమే ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. అందువల్ల రాత్రి పూట షూటింగ్, పగలు విశ్రాంతి వల్ల పవన్ ఈ ఫంక్షన్ కి రాలేకపోయాడని సమాచారం. ఈ అల్లు అర్జున్ సంగీత్ కి నాగార్జున, మహేష్ బాబు, ప్రభాస్, రానా, రామ్, నవదీప్, మధుషాలిని, అర్చన, శ్రావ్య, వేణు మాధవ్ వంటి వారంతా హాజరయ్యారు.