English | Telugu

ఎయిట్ ప్యాక్ తో రామ్ చరణ్

ప్రస్తుతం యువతంతా సిక్స్ ప్యాక్ లేదా వీలైతే ఏకంగా ఏయిట్ ప్యాక్ కోసం కష్టపడుతున్నారు. మామూలు యువతే అలా తయారవుతుంటే "మగధీర" లాంటి హిట్టిచ్చిన ఒక యువ హీరో రామ్ చరణ్ తేజ మరి ఎయిట్ ప్యాక్ కోసం కష్టపడటం పెద్దగా ఆశ్చర్యం కలిగించే సంగతి కాదు. "మగధీర" చిత్రంలోనే రామ్ చరణ్ తన బాడీ ఎలా ఉంటుందో శాంపిల్ గా చూపించాడు. కానీ "ఆరెంజ్" ఫ్లాపవటంతో మరింత కసిగా తన శరీరాన్ని ఎయిట్ ప్యాక్ తో ఉండేలా కష్టపడుతున్నాడు.

అలాగే యువ దర్శకుడు సంపత్ నంది చెప్పిన కథ నచ్చిన రామ్ చరణ్ ఆ సినిమా మీద శ్రద్ధ చూపిస్తున్నాడని సమాచారం. సంపత్ నంది దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించబోయే చిత్రం కోసం ఈ నెలలో ఒక ఫొటో షూట్ కూడా నిర్వహించనున్నారు. ఈ చిత్రం రామ్ చరణ్ కి పక్కా హిట్టవుతుందని ఇదొక మాస్ మసాలా చిత్రమనీ తెలిసింది. ఈ చిత్రాన్నిమెగా సూపర్ గుడ్ ఫిలింస్ పతాకంపై, యన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ మనకు ఎయిట్ ప్యాక్ తో కనిపించనున్నాడట.