English | Telugu
ఎన్టీఆర్ చేసిన ఆ హిట్ సినిమా పవన్‌కళ్యాణ్ చేసి ఉంటే...!
Updated : Dec 7, 2023
ఒక స్టార్ హీరో, టాప్ డైరెక్టర్ కాంబినేషన్‌లో సినిమా సెట్ అవ్వడం వెనుక ఎన్నో డిస్కషన్స్ జరుగుతాయి. ఒక్కోసారి డైరెక్టర్ చెప్పిన కథ ఆ హీరోకి నచ్చకపోవడం, దాన్ని మరో హీరో విని ఓకే చెయ్యడం జరుగుతూ ఉంటుంది. అలా ఒక హీరో రిజెక్ట్ చేసిన కథతో మరో హీరో హిట్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి, ఫ్లాప్ అయిన సందర్భాలూ ఉన్నాయి. ఒక హీరోకి నచ్చిన కథ మరో హీరోకి నచ్చకపోవచ్చు. అలాగే ఒక హీరో రిజెక్ట్ చేసిన కథ మరో హీరోకి నచ్చొచ్చు. ఇండస్ట్రీలో ఏదైనా జరుగుతుంది. అందులో ఎలాంట సందేహం లేదు.
ఓ కథ విషయంలో పవన్‌కల్యాణ్‌కి ఈ అనుభవం ఎదురైంది. టాలీవుడ్‌లోనే టాప్ డైరెక్టర్‌గా పేరున్న త్రివిక్రమ్ ‘జల్సా’ సినిమా చేస్తున్న సమయంలో ప్యాక్షనిజం బ్యాక్‌డ్రాప్‌లో పవన్‌తోనే ఓ సినిమా చెయ్యాలని ప్లాన్ చేసుకున్నాడు. అందుకోసం ఫ్యాక్షనిజంపై రీసెర్చ్ చేసి పక్కా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడు. ‘కోబలి’ అనే టైటిల్‌తో ఆ సినిమా చెయ్యాలనుకున్నాడు. కానీ, ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. తర్వాత అదే ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్‌లో ఎన్టీఆర్ హీరోగా ‘అరవింద సమేత వీర రాఘవ’ చేశాడు. అది బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది. పవన్‌కళ్యాణ్‌తో అనుకున్న ‘కోబలి’ కథనే మార్చి ‘అరవింద సమేత’ చేశాడని ఆమధ్య అందరూ చెప్పుకున్నారు. ఏ సందర్భం వచ్చిందో తెలీదుగానీ ఇప్పుడు ఆ పాత న్యూస్ మళ్ళీ వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో దీనిపై చర్చ జరుగుతోంది. ఈ విషయం తెలుసుకున్న పవర్‌స్టార్ ఫ్యాన్స్ చాలా ఫీల్ అవుతున్నారు. అదే కథతో పవన్‌కల్యాణ్ సినిమా చేసి ఉంటే పెద్ద హిట్ అయి వుండేది కదా అని బాధపడుతున్నారట.