English | Telugu
ఎన్టీఆర్ 'దేవర'లో 'గుప్పెడంత మనసు' హాట్ బ్యూటీ!
Updated : Dec 7, 2023
'గుప్పెడంత మనసు' సీరియల్ లో జగతిగా చీరకట్టులో హుందాగా కనిపించిన నటి జ్యోతి రాయ్.. సోషల్ మీడియాలో మాత్రం బోల్డ్ పిక్స్ తో కుర్రకారుకి పిచ్చెక్కిస్తుంది. అందుకే ఆమెకి యూత్ లో ఎంతో ఫాలోయింగ్ ఉంది. అయితే ఇప్పుడు ఈ హాట్ బ్యూటీ పాన్ ఇండియా మూవీ 'దేవర'లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతోన్న మూవీ 'దేవర'. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో జ్యోతి రాయ్ నటిస్తున్నట్లు సమాచారం.
యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతోంది. మొదటి భాగం 2024, ఏప్రిల్ 5న విడుదల కానుంది.