English | Telugu

పవన్ సినిమాలో.. "చికుబుకు చికుబుకు రైలే" ఫేమ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మూడు చిత్రాలతో బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, సుజిత్ డైరెక్షన్ లో ఓజీ, హరీశ్ శంకర్ నిర్దేశకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ చేస్తున్నారు పవన్. ఈ మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా వచ్చే ఏడాది తెరపైకి వచ్చే అవకాశముంది.

ఇదిలా ఉంటే, పవన్ - హరీశ్ శంకర్ కాంబోలో తెరకెక్కతున్న ఉస్తాద్ భగత్ సింగ్ కి సంబంధించి ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ఇందులో సీనియర్ నటీమణి గౌతమి ఓ ముఖ్య పాత్రలో కనిపించనుందట. తెలుగులో శ్రీనివాస కళ్యాణం (వెంకటేశ్), చైతన్య (నాగార్జున)తో పాటు కమల్ హాసన్ అనువాద చిత్రాలైన విచిత్ర సోదరులు, క్షత్రియ పుత్రుడుతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు గౌతమి. అలాగే శంకర్ తొలి చిత్రం జెంటిల్ మేన్ లో చికుబుకు చికుబుకు రైలే పాటలోనూ ఆమె ఆడిపాడారు. త్వరలోనే ఉస్తాద్ లో గౌతమి ఎంట్రీపై క్లారిటీ రానుంది.

కాగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ లో క్రేజీ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బాణీలు అందిస్తున్నాడు.