English | Telugu
" ఏడుకొండలు"గా పవన్ కళ్యాణ్
Updated : Dec 16, 2011
" ఏడుకొండలు"గా పవన్ కళ్యాణ్ నటించనున్నారని ఫిలిం నగర్ వర్గాల భోగట్టా. వివరాల్లోకి వెళితే ప్రముఖ కొరియోగ్రాఫర్ కమ్ యాక్టర్ రాజు సుందరం దర్శకత్వంలో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిర్మించే చిత్రానికి "ఏడుకొండలు" అనే పేరుని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ " ఏడుకొండలు" చిత్రం గ్రామీణ నేపథ్యంలో జరిగే కథతో నిర్మిస్తున్నారట. ఈ " ఏడుకొండలు" చిత్రానికి కథను ప్రముఖ దర్శకుడు యస్.జె.సూర్య అందిస్తున్నాడు.
ఈ " ఏడుకొండలు" చిత్రంలో రోమా అస్రాని హీరోయిన్ గా నటించనుందని తెలిసింది. ఈ " ఏడుకొండలు" చిత్రంలో నాగబాబు హీరోయిన్ తండ్రిగా నటించనున్నారు. ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, , డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న చిత్రం "గబ్బర్ సింగ్". హిందీలో సూపర్ హిట్టయిన "దబాంగ్" చిత్రానికిది రీమేక్.