English | Telugu

యాంకర్ గా పూరీ జగన్నాథ్

యాంకర్ గా పూరీ జగన్నాథ్ వ్యవహరించనున్నారని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే ఆర్ ఆర్ మూవీ మేకర్స్ పతాకంపై, ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా, కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, డాక్టర్ వెంకట్‍ నిర్మిస్తున్న చిత్రం "బిజినెస్ మ్యాన్". ఈ "బిజినెస్ మ్యాన్" చిత్రం ఆడియోని డిసెంబర్ 22 వ తేదీన, శిల్పకళావేదికపై విడుదల కానుంది. ఈ "బిజినెస్ మ్యాన్" చిత్రం ఆడియోని తెలుగు, తమిళ, మళయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు.

మామూలుగా ఏ పెద్ద సినిమా ఆడియో ఫంక్షన్ కైనా సుమో, లేక ఝాన్సీనో యాంకర్లుగా వ్యవహరిస్తారు. కానీ ఈ "బిజినెస్ మ్యాన్" చిత్రం ఆడియో ఫంక్షన్ కి విచిత్రంగా ఈ చిత్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ యాంకర్ గా వ్యవహరించనున్నారని తెలిసింది. అది కూడా హీరో మహేష్ బాబు మాట మీద పూరీ జగన్నాథ్ ఈ అలవాటులేని పనికి పూనుకున్నాడట. అందుకు ప్రస్తుతం రిహార్సిల్ కూడా చేస్తున్నాడని సమాచారం. ఈ "బిజినెస్ మ్యాన్" చిత్రం 2012 జనవరి 11 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.