English | Telugu
రవితేజ, సూర్య ఒకే చిత్రంలో
Updated : Dec 16, 2011
రవితేజ, సూర్య ఒకే చిత్రంలో కలసి నటించనున్నారు. వివరాల్లోకి వెళితే తెలుగు సినీ పరిశ్రమలో, ప్రేక్షకుల్లో మాస్ మహరాజాగా పేరొందిన హీరో రవితేజ త్వరలో ప్రముఖ తమిళ హీరో "గజిని" ఫేం సూర్యతో కలసి నటించబోతున్నాడు. రవితేజ, సూర్య హీరోలుగా నటించబోయే చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించనున్నారు. వెంకట్ ప్రభు తమిళంలో అజిత్ హీరోగా "గ్యాంబ్లర్" అనే చిత్రానికి దర్శకత్వం వహించారు.
సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో నిండి, స్టైలిష్ గా ఉండే సినిమాలు తీయటంలో వెంకట్ ప్రభు అందెవేసిన చెయ్యి అని తమిళ సినీ పరిశ్రమ అంటూంది. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందిస్తారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో నిర్మిస్తారు. మరి ఈ ఇద్దరు మాస్ హీరోలు కలసి నటించబోయే ఈ మాస్ మసాలా చిత్రం ప్రేక్షకులను ఇంకెంతగా అలరిస్తుందో వేచి చూడాలి.