English | Telugu

3డి మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

3డి మూవీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించనున్నాడని ఫిలిం నగర్ వర్గాలంటున్నాయి. వివరాల్లోకి వెళితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, ప్రముఖ కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ రాజు సుందరం దర్శకత్వంలో ఒక సినిమా ప్రారంభం కావలసి ఉంది. ఈ చిత్రానికి "ఛత్రపతి" ప్రసాద్ అంటే బి.వి.యస్.యన్.ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తారు. అయితే దర్శకుడు రాజు సుందరం మనసులో ఒక కొత్త ఆలోచన ఉంది.

హాలీవుడ్ లోసూపర్ హిట్టయిన "హేంగోవర్" అనే సినిమాని తఎలుగులో తీయాలన్నదే ఆ ఆలోచన. ముగ్గురు స్నేహితులు బాగా మందుకొట్టిన తర్వాత చేసిన పనుల ఫలితమే "హేంగోవర్" చిత్ర కథ. ఈ చిత్రంలో ఈ ముగ్గురితో పాటు ఒక సింహం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రం ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుంది. అయితే ఈ చిత్రాన్నే తెలుగులో 3డి లో, పవన్ కళ్యాణ్ హీరోగా తీయాలని రాజు సుందరం ప్రయత్నిస్తున్నాడట.