English | Telugu

బిపాసాకి రానాకి చెడింది

బిపాసాకి రానాకి చెడింది అని ఫిలిం నగర్ వాసులంటున్నారు. వివరాల్లోకి వెళితే బాలీవుడ్ బ్లాక్ హాట్ బెంగాలీ బ్యూటీ బిపాసా బసు గతంలో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహాంతో కొన్నాళ్ళు ఎఫైర్ బలంగానే నడిపింది. అప్పట్లో వాళ్ళిద్దరూ సహజీవనం చేసేవారు. వాళ్ళిద్దరూ పెళ్ళి చేసుకుంటారని కూడా వినపడింది. ఆ తర్వాత యువరాజ్ సింగ్ తో, అదీ బెడిసి కొట్టటంతో మన తెలుగబ్బాయి రానాని లైన్లో పెట్టిందని ఫిలిం నగర్ వాసులంటున్నారు.

రానా, బిపాసా బసు కలసి ఒక హిందీ చిత్రంలో నటించారు. అయితే ప్రస్తుతం అది కూడా బెడిసి కొట్టిందట. కారణం ఏంటయ్యా అంటే మొన్న గోవాలో ఆంగ్ల నూతన సంవత్సర వేడుకల్లో హీరోయిన్ త్రిషతో కలసి రానా కనిపించాడట. ఆ విషయం తెలిసి రానాతో తన ఎఫైర్ వర్కవుట్ కాదనుకుందో ఏమో బిపాసా బసు తనదారి తాను చూసుకుందట. ఇదెంతవరకూ నిజమో కాలమే చెప్పాలి.