English | Telugu

యన్ టి ఆర్ పెళ్ళి మీద ఐటి డేగ కన్ను

యన్ టి ఆర్ పెళ్ళి మీద ఐటి డేగ కన్ను వేసిందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే యన్ టి ఆర్, లక్ష్మీ ప్రణతిల వివాహం మే 5 వ తేదీ రాత్రి 2.41 గంటలకు జరుగనుంది. ఈ పెళ్ళి ఏర్పాట్లు చాలా భారీగా జరుగుతూండటంతో ఈ పెళ్ళికి చాలా భారీ మొత్తంలో ధనాన్ని ఖర్చుచేస్తున్నారని మీడియాలో వినపడుతూండటంతో ఐటి శాఖ అదేనండీ ఆదాయపు పన్నుశాఖ వారి డేగ కన్ను నార్నే, నందమూరి వారి మీద పడిందట. యన్ టి ఆర్ పెళ్ళికి ముద్రించిన ఒక్కొక్క పెళ్ళి శుభలేఖ ఖరీదే మూడు వేల రూపాయలనీ, యన్ టి ఆర్ పెళ్ళి కళ్యాణ మంటపానికి అయ్యే ఖర్చు దాదాపు 18 కోట్ల రూపాయలనీ ఇంకా ఈ పెళ్ళి ఏర్పాట్లు చాలా భారీగా ఉండటంతో ఆదాయపు పన్ను శాఖ వారు ఈ రెండు కుటుంబాల మీద తమ దృష్టి సారించారు.

గతంలో అల్లు అర్జున్ పెళ్ళి సందర్భంగా కూడా ఆదాయపు పన్ను శాఖ వారు ఆ పెళ్ళి గురించి చాలా రహస్యంగా విచారించటం గమనించిన అల్లు అరవింద్, చిరంజీవి ఇద్దరూ వారికి దొరక్కుండా ఉండేందుకు అవసరమైన జాగ్రత్తలను తీసుకున్నారట. అయినా మామయ్య చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు, మరో మామయ్య అధికారపక్షం యమ్.యల్.ఎ., అత్తయ్య కేంద్రమంత్రిగా ఉన్న యన్ టి ఆర్ జోలికి ఆదాయపు పన్ను శాఖ వెళుతుందన్నది అనుమానమే...ఏమంటారు...?