English | Telugu

వీరప్పన్ కథతో వర్మ సినిమా

వీరప్పన్ కథతో వర్మ సినిమా తీయటానికి సిద్ధమవుతున్నాడని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే ఎప్పుడూ ఏదో ఒక సంచల వ్యాఖ్యలతో, సినిమాలతో ఏదో ఒక సంచలనాన్ని సృష్టించే ప్రముఖ దర్శక, నిర్మాత రామ్ గోపాల వర్మ త్వరలో గంధపు కలప స్మగ్లర్, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన వీరప్పన్ కథతో రామ్ గోపాల వర్మ ఒక సినిమా తీయటానికి సన్నాహాలు చేస్తున్నాడట.

ఈ సినిమా పని మీద వీరప్పన్ భార్యను కూడా కలవబోతున్నాదట వర్మ. రామ్ గోపాల వర్మ ప్రస్తుతం ఈ చిత్రం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నాడట. ఇంకో వాదన ఏమిటంటే వీరప్పన్ భార్యే ఈ సినిమాకి నిర్మాత అని కూడా వినిపిస్తూంది.

 

మామూలుగా "పుణ్యం సంపాదించి స్వర్గానికి మగాళ్ళు వెళితే రంభ, ఊర్వశి, మేనకలున్నట్టే అలాగే అక్కడికి వెళ్ళిన ఆడవాళ్ళకి మగ వేశ్యలుంటారా...? 100 కోట్ల మందిలో ఆరు లక్షలమంది మాత్రమే సాయిబాబాని చూడటానికి వెళ్తే మిగిలిన 99,94,00,000 మందికి సాయిబాబా అక్కర్లేదన్నమాట" అనేటువంటి వివాదాస్పద వ్యాఖ్యలు అనునిత్యం చేసే రామ్ గోపాల వర్మ ఏమైనా అనగలడు....ఏదైనా చేయగలడు...ఈ విషయంపై మీ స్పందనేమిటి....? మీరేమంటారు....?