English | Telugu

రవితేజ, హరీష్ శంకర్ న్యూమూవీ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్

రవితేజ, హరీష్ శంకర్ న్యూ మూవీ "సుబ్రహ్మణ్యం ఫర్ సేల్" అని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే మాస్ రాజా రవితేజ హీరోగా, తన తొలి చిత్రం "షాక్" తో షాక్ తిన్నా తట్టుకుని తాను "మిరపకాయ్"నని నిరూపించుకున్న డైనమిక్ యంగ్ డైరెక్టర్‍ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ "సుబ్రహ్మణ్యం ఫర్ సేల్" అనే సినిమా రానుందని ఫిలిం నగర్ లో రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ "సుబ్రహ్మణ్యం ఫర్ సేల్" అనే టైటిల్ ని ఇప్పటికే ఫిలిం ఛాంబర్ లో రిజిస్ట్రేషన్ చేయించారని కూడా వినపడుతోంది.

ప్రస్తుతం సమాజాన్ని పట్టిపీడిస్తున్న వరకట్న సమస్య మీద ఆధారపడి ఈ చిత్రం కథ తయారుచేశారని తెలిసింది. అదీ గాక "సుబ్రహ్మణ్యం ఫర్ సేల్" రవితేజ స్టైల్లో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతుందని సమాచారం. ప్రస్తుతం రవితేజ "వీర" సినిమాతో బిజీగా ఉన్నారు. అలాగే హరీష్ శంకర్ "గబ్బర్ సింగ్" సినిమాకి స్క్రిప్ట్ తయారుచేయటంలో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాలూ పూర్తి కాగానే "సుబ్రహ్మణ్యం ఫర్ సేల్" సెట్స్ మీదకు వెళుతుందని తెలిసింది.