English | Telugu
ఎపి ఎన్నికల్లో పిఠాపురం నుంచి బరిలోకి దిగుతున్న మెగా ప్రొడ్యూసర్!
Updated : Dec 20, 2023
ప్రముఖ నిర్మాత బన్ని వాస్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారన్న వార్త ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌లో అల్లు అరవింద్‌తో కలిసి పలు చిత్రాలు నిర్మించిన బన్నివాస్ మెగా ప్రొడ్యూసర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. బన్నీ వాసుకి పార్టీ ప్రచార బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. బన్నీ వాసు అసలు పేరు ఉదయ శ్రీనివాస్ గవర. అతను బన్నికి మంచి స్నేహితుడు కావడం వల్ల ఇండస్ట్రీలో అతన్ని అందరూ బన్నివాసుగా పిలుస్తారు.
జనసేన పార్టీ ఆవిర్భావం నుండి బన్నీ వాసు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌తో కలిసి పనిచేస్తున్నారు. కానీ, ఆ విషయం ఎప్పుడూ బహిర్గతం కాలేదు. అయితే పార్టీకి వాసు తన సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారని అంటారు. పవన్ కళ్యాణ్‌కి అత్యంత సన్నిహితుల్లో బన్నీవాసు ఒకరు. వారానికి రెండు రోజులు పూర్తిగా ఆంధ్రలోనే పర్యటిస్తూ ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని పవన్‌కు అందిస్తుంటారు. బన్నీ వాసు సొంత ఊరైన పాలకొల్లు నుండి పోటీ చేస్తారని అందరూ అనుకుంటున్నారు. కానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో అతను పిఠాపురం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న జనసేన అభ్యర్థుల జాబితాలో పిఠాపురం నుంచి బన్నివాసు పేరు ఉంది.