English | Telugu
విజయ్ దేవరకొండకి భలే ఛాన్సులే.. అది ఎన్టీఆర్ చేతుల్లోనే ఉంది!
Updated : Jan 24, 2024
గత కొంతకాలంగా సినిమాల రిలీజ్‌లు గందరగోళంగా మారుతున్నాయి. ముందుగా చెప్పిన డేట్‌కి ఏ ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వడం లేదు. గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ తంతు నడుస్తోంది. ఇక సంక్రాంతి సినిమాల విషయం వేరే చెప్పక్కర్లేదు. ఇప్పుడది సమ్మర్ రిలీజ్‌లపై కూడా పడిరది. సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 5న విడుదల కావాల్సిన ఎన్టీఆర్, కొరటాల శివల ‘దేవర’ వాయిదా పడిరదని వార్తలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ విషయం గురించి ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. తమ అభిమాన హీరో సినిమా వాయిదా పడనుందన్న వార్తను వారు భరించలేకపోతున్నారు. ఈ వార్తలో ఎంత మాత్రం నిజం లేదని కొట్టిపారేస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా రిలీజ్ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించే వరకు వెయిట్ చెయ్యక తప్పదు.
ఇదిలా ఉంటే.. ఇదే ఛాన్స్ కోసం విజయ్ దేవరకొండ ఎదురుచూస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. పరశురామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రాన్ని ఏప్రిల్ 5న రిలీజ్ చేస్తే బాగుంటుందని దిల్ రాజు ఆలోచిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఏప్రిల్‌లో స్కూల్ పిల్లలకు సెలవులు వుంటాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ‘ఫామిలీ స్టార్’కి ఇది సరైన సమయంగా భావిస్తున్నారు. నిర్మాత దిల్‌రాజు కూడా ఇదే ఆలోచనతో యూనిట్‌ని ఎలర్ట్ చేస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఎంత బ్యాలెన్స్ ఉందనే విషయం మాత్రం రివీల్ చెయ్యడం లేదు. అయితే బ్యాలెన్స్ వర్క్ త్వరగా పూర్తి చేయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మాత్రం అర్థమవుతోంది.