English | Telugu
తూచ్...మళ్ళీ కలిసిపోయారు...!
Updated : Jan 24, 2014
నయనతార, శింబుల ప్రేమాయణం మరింత ఎక్కువైపోతుంది. వీరిద్దరూ పిచ్చెక్కిన ప్రేమికులవలె గతంలో ప్రేమించుకుని, ఆ తర్వాత తూచ్.. నాకు నచ్చట్లేదు అంటూ ఇద్దరు విడిపోయారు. విడిపోయి పద్దతిగా ఉన్నారా అంటే.. అది కూడా కాదు.. శింబుతో విడిపోయాక ప్రభుదేవాతో పెళ్లికి సిద్ధమయ్యింది నయనతార. పాపం నయనతార కోసం ప్రభు తన భార్యకు విడాకులు కూడా ఇచ్చేసాడు. ఆ తర్వాత ప్రభుకి కూడా తూచ్ అని చెప్పేసి, అక్కడి నుండి జంప్ అయ్యింది. ఆ తర్వాత హీరో ఆర్యతో క్లోస్ ఫ్రెండ్ షిప్ ను మెయింటేన్ చేస్తుంది. అదే విధంగా నయనతో విడిపోయాక హన్సికను పట్టుకున్నాడు శింబు. వీరిద్దరూ కూడా త్వరలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుని, ఇరు కుటుంబాలను కూడా ఒప్పించారు. కానీ శింబు,హన్సికలు విడిపోయారు. ఆ తర్వాత శింబు మాములుగా కొందరు హీరోయిన్లతో క్లోస్ రిలేషన్ షిప్ ను మెయింటేన్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే నయనతార, శింబులు కలిసి ప్రస్తుతం తమిళ దర్శకుడు పాండిరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో జంటగా నటిస్తున్నారు. ఇందులోని ఓ సన్నివేశం కోసం వీళ్లిద్దరూ నాలుగుసార్లు రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. రకరకాల ట్రెడిషన్‌లో పెళ్లి చేసుకునే సీన్‌ని దర్శకుడు పాండిరాజ్ చిత్రీకరించాడు. ఈ సన్నివేశాలు చాలాబాగా వచ్చాయని యూనిట్ సభ్యులు సైతం చెప్పుకొంటున్నారు. సినిమా విషయం కాసేపు పక్కనబెడితే... వీరిద్దరూ కూడా సినిమా షూటింగ్ సమయంలో చాలా సమయం వరకు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారట. వీరి మధ్య ఉండే కోపాలు, తాపాలు అన్ని పోయి.. మళ్ళీ ఒకటయ్యే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి వీరిద్దరి పెళ్లి నిజ జీవితంలో ఎప్పుడు జరుగుతుందో చూడాలి.