English | Telugu

రవితేజ టార్గెట్ పవన్ పైనేనా...?

 

బాబీ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రానికి "పవర్" అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ లో రవితేజ "గబ్బర్ సింగ్" సినిమాలో పవన్ మాదిరిగా తిక్క ఉన్నపోలీస్ గా కనిపిస్తున్నాడు. ఇంతకు ముందు పవన్ కూడా "గబ్బర్ సింగ్" పోస్టర్లో మాస్ పోలీస్ గా కనిపించాడు. ఇపుడు అదే స్టైల్ లో రవితేజ "గబ్బర్ సింగ్"ను మించిన తిక్కలోడిగా, పోలీస్ పాత్రలో అదరగొట్టడానికి సిద్ధమైనట్లుగా కనిపిస్తుంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో హీరోకి ఒక కొత్త స్టైలిష్, మాస్ బ్యాక్ గ్రౌండ్ ను స్పెషల్ గా అందిస్తున్నాడని, రీ-రికార్డింగ్ చాలా కొత్తగా చేయాలని తమన్ ప్రయత్నిస్తున్నాడని తెలిసింది. మరి పవన్ "గబ్బర్ సింగ్" సినిమాలాగే రవితేజ "పవర్" కూడా బ్లాక్ బస్టర్ హిట్టవుతుందో లేదో త్వరలోనే తెలియనుంది.