English | Telugu

ఈ వయసులోనూ తగ్గని ఛరిష్మా.. టాప్‌ డైరెక్టర్‌ సినిమాలో నయనతార!

తన రెండో సినిమా ‘మా నగరం’తోనే సూపర్‌హిట్‌ కొట్టి అప్పటి నుంచి అపజయం ఎరుగని డైరెక్టర్‌గా తన జైత్రయాత్రను కొనసాగిస్తున్న లోకేష్‌ కనకరాజ్‌ ప్రస్తుతం విజయ్‌ హీరోగా రూపొందిస్తున్న ‘లియో’ చిత్రాన్ని కంప్లీట్‌ చేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా రెండు భాగాలుగా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా కమల్‌హాసన్‌తో చేసిన విక్రమ్‌, కార్తీతో చేసిన ఖైదీ చిత్రాలకు సీక్వెల్స్‌ కూడా ఉంటాయని తెలుస్తోంది. ఇవి కాక మరి కొంతమంది నిర్మాతలు లోకేష్‌తో సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే వాటి వివరాలు ఇంకా తెలియరాలేదు. ఇదిలా ఉంటే హీరోయిన్‌ నయనతారతో లోకేష్‌ ఒక సినిమా చేసే అవకాశం ఉందనే వార్త వినిపిస్తోంది. ఈ సినిమాలో లారెన్స్‌ హీరోగా నటిస్తాడని తెలుస్తోంది. తమిళ్‌ హీరోయిన్లలో సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయనతార అద్భుతమైన కెరీర్‌తో దిగ్విజయంగా ముందుకు దూసుకెళ్తోంది. షారూఖ్‌ఖాన్‌ లేటెస్ట్‌ మూవీ ‘జవాన్‌’లో నటించింది నయన. 40 ఏళ్ళ వయసులోనూ హీరోయిన్‌గా దూసుకెళ్తున్న నయన్‌ ఇప్పటికే 75 సినిమాలు పూర్తి చేసింది.